News August 23, 2024
జవాబుదారీ తనానికి గ్రామాలే నిదర్శనం: తూ.గో కలెక్టర్

గ్రామ సభలను విజయవంతం చేసేందుకు ప్రజలను, ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తూ.గో కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి గ్రామసభల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో సభలను నిర్వహించాలని, ఇందుకోసం గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.
Similar News
News March 20, 2026
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది కానుకగా యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేశామని, నిరుద్యోగులంతా పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
News March 19, 2026
పెరవలిలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

పెరవలిలో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఓ కారు అదుపుతప్పి వేగంగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని, యువకుడు నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
News March 19, 2026
కలెక్టరేట్‌లో ఉగాది సంబరాలు

రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి MLC సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.


