News August 23, 2024
ఆ ప్రాంతం వారు మాత్రమే సమస్యలు తెలిపాలి: కలెక్టర్

గ్రామ సభ ఏ పంచాయతీలో జరుగుతుందో ఆ గ్రామ ప్రజలు వచ్చి తమ సమస్యలు ఉప ముఖ్యమంత్రి పవన్‌కి తెలుపుకోవాలని, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. రాజంపేటలోని మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. గ్రామ సభలు జరిగే ప్రదేశంలో ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎవరు రావొద్దని తెలిపారు.
Similar News
News March 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
➤ 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,770
➤ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,508
➤ వెండి 10 గ్రాముల ధర రూ.2,720.
News March 12, 2026
కడప: రేపు వైవీయూ కాన్వకేషన్ .. ఏర్పాట్లు పూర్తి

యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు లోపు విద్యార్థులు తిరుపతి బైపాస్ రోడ్డులోని డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందన్నారు. వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తామన్నారు.
News March 12, 2026
కడప: రేపు రూ.125.97 కోట్లు అకౌంట్లోకి జమ

కడప జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ- పీఏం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులు డేటాను సిద్ధం చేశారు. మూడో విడత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 2,15,283 మంది రైతులకు రూ.125.97 కోట్లు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ కింద రూ.86.11 కోట్లు, PM కిసాన్ కింద రూ.39.86 కోట్లు విడుదల చేయనున్నారు.


