News August 23, 2024

వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: YS జగన్

image

AP: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వక్ఫ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీల సమస్యలపై దృష్టి పెట్టాం. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశాం. వక్ఫ్ బిల్లుపై అభ్యంతరాలను పార్లమెంటులో చర్చిస్తాం. ముస్లింల అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తాం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 7, 2026

PCOD ఉన్నప్పుడు ఏం తినాలంటే..

image

పీసీఓఎస్‌ ఉన్నా.. చక్కటి ఆహార నియమాలు, జీవనశైలి మార్పులతో బరువు తగ్గచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, మంచి కొవ్వులు, గుడ్లు, నట్స్‌, పాలు, పాల పదార్థాలు, మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. మరీ అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు ఆయా సప్లిమెంట్లు తీసుకుని కూడా బరువును అదుపులోకి తెచ్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

News January 7, 2026

ఫ్యామిలీతో జల విహారం చేస్తారా?

image

APలోనే తొలిసారి ఎన్టీఆర్(D) ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కేరళ తరహా ఫ్లోటెడ్ బోట్లను అధికారులు ఏర్పాటుచేశారు. రేపు సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాజమండ్రి, నెల్లూరు, కడప తదితర 11 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ బోట్లలో ఒక బెడ్, టీవీ, కుర్చీలు, వెస్ట్రన్ టాయిలెట్, హాల్ సౌకర్యాలుంటాయి. 24 గంటలపాటు ఫ్యామిలీతో జలవిహారం చేయొచ్చు. ధర రూ.8వేల వరకు ఉంటుంది.

News January 7, 2026

LIC జీవన్ ఉత్సవ్.. బెనిఫిట్స్ ఇవే

image

LIC కొత్తగా జీవన్ ఉత్సవ్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో జీవితాంతం ఆదాయం, బీమా రక్షణ లభిస్తుందని తెలిపింది. JAN 12 నుంచి స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నెల వయసు పిల్లల నుంచి 65ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం ₹5L. గరిష్ఠ పరిమితి లేదు. ప్రతి ₹వెయ్యికి ఏటా₹40 చొప్పున జమ అవుతుంది. 7-17ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది. దీన్ని LIC వద్దే ఉంచితే 5.5% చక్రవడ్డీ చెల్లిస్తుంది.