News August 23, 2024
రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు ఆదేశాలు
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై పోరాడుతున్న మహిళా రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రతను తొలగించడంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాల్ని ఇచ్చేవరకూ భద్రతను తిరిగి కల్పించాలని తేల్చిచెప్పింది. భద్రతను ఎందుకు తొలగించారో వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించింది. మరోవైపు.. తాము భద్రతను తొలగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతుండటం గమనార్హం.
Similar News
News January 15, 2025
ధూమపానం, మద్యపానం, అధిక బరువుతో అనేక క్యాన్సర్లు!
ధూమపానం, మద్యపానానికి బానిసలై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించడాన్ని మానేస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అధిక బరువు వల్ల 13 రకాల క్యాన్సర్లు, స్మోకింగ్ వల్ల ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావొచ్చని తెలిపారు. ఆల్కహాల్ వల్ల స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది. అందుకే వీటిని మానేసి పౌష్టికాహారం తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదంటున్నారు.
News January 15, 2025
ప్రేమించిందని పోలీసుల ముందే కూతురిని చంపిన తండ్రి
MPకి చెందిన మహేశ్ గుర్జార్ తన కూతురు తనూ(20)కు మరో 4 రోజుల్లో పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. ఇంతలో తాను విక్కీ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబీకులు ఒప్పుకోవడంలేదంటూ తనూ SMలో ఓ వీడియో పెట్టింది. విషయం పోలీసులకు, గ్రామస్థులకు తెలియడంతో నచ్చజెప్పేందుకు పంచాయితీ పెట్టారు. ఈక్రమంలోనే తండ్రీకూతురు మధ్య వాగ్వాదం జరగడంతో అందరి ముందే తనూను మహేశ్ కాల్చి చంపాడు.
News January 15, 2025
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు-2025
*మే 12న ఈసెట్
*జూన్ 1న ఎడ్‌సెట్
*జూన్ 6న లాసెట్, పీజీ లా సెట్
*జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్
*జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్