News August 23, 2024
మన రాష్ట్రం నుంచి ఒక్కరూ కనిపించలేదా?: కేటీఆర్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చాక తెలంగాణేతరులకు పదవుల్ని ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. ‘రాజ్యసభ అభ్యర్థిగా మన రాష్ట్రం వారు ఒక్కరూ కాంగ్రెస్‌కు కనిపించలేదా? అభిషేక్ మను సింఘ్వీది ఏ రాష్ట్రం? వీహెచ్ లాంటివారికి రాజ్యసభ సీటు ఎందుకివ్వలేదు?’ అని ప్రశ్నించారు. అదానీ విషయంలో రాహుల్, రేవంత్‌కు విభేదాలున్నాయని ఆయన పేర్కొన్నారు. అదానీపై జేపీసీ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 13, 2026
జిల్లాల పునర్విభజన ఇప్పుడు సాధ్యం కాదా?

TG: జిల్లాల పునర్విభజన చేపడతామన్న ప్రభుత్వ నిర్ణయానికి దేశవ్యాప్త జనగణన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. 2027 MAR 1 నుంచి జరిగే ఈ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు ఇప్పట్లో మార్చొద్దని గతంలో కేంద్రం సూచించింది. దీనివల్ల జనగణనలో ఇబ్బందులు ఏర్పడి, జిల్లాలవారీ లెక్కలు తీయడం సాధ్యం కాదని చెప్పింది. మరి పునర్విభజనకు ప్రభుత్వం రెండేళ్లు ఆగుతుందా? లేదంటే ఎలా ముందుకెళ్తుంది? అనేది ఆసక్తికరం.
News January 13, 2026
పందెం కోళ్లు.. పేర్లు తెలుసా?

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలోని పలు చోట్ల బరులు, కాళ్ల బలం చూపించేందుకు కోళ్లు సిద్ధమయ్యాయి. నెలలుగా ప్రత్యేక శిక్షణ, ఆహారం ఇచ్చి రెడీ చేసిన తమ కోళ్లను బరిలో దించి గెలిచేందుకు యజమానులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సేతు, కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, కిక్కిరాయి, మైల, పింగళి, అబ్రాస్ రకాలను బరిలో దించుతుంటారు. కోళ్ల ఈకల రంగు, మెడ, కాళ్ల సైజు, శరీర తత్వాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు.
News January 13, 2026
కోలీవుడ్‌లో కొత్త వివాదం.. పరాశక్తి బ్యాన్‌కు కాంగ్రెస్ డిమాండ్

కోలీవుడ్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో తమ పార్టీని, నేతల్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా సీన్‌లను తొలగించాలని డిమాండ్ చేసింది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 10న రిలీజైంది.


