News August 23, 2024
కందిగోపుల మురళికి వైఎస్ జగన్ భరోసా

‘ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటా’ అంటూ తాడిపత్రి వైసీపీ నేత కందిగోపుల మురళికి మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. మూడు రోజుల క్రితం ఆయన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో నిన్న విజయవాడలో జగన్‌ను మురళి కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. త్వరలో మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ధైర్యం కోల్పోరాదని సూచించారు. వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు.
Similar News
News March 29, 2026
నేడు ఎల్లనూరు మండలానికి హీరో విజయ్ దేవరకొండ రాక

ఎల్లనూరు మండలంలో నేడు హీరో విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. మండల పరిధిలోని జంగంపల్లి కోట వద్ద ‘రణబలి’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అందుకు తగ్గ ఏర్పాట్లను సిద్ధం చేశారు. పుట్లూరు సీఐ సత్యబాబు బందోబస్తు చేపట్టారు.

News March 28, 2026
SKU వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్ బాధ్యతలు

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఈయనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ నెల 13న వైస్ ఛాన్స్‌లర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.