News August 23, 2024
కల్యాణ లక్ష్మి నిధులు విడుదల

TG: కల్యాణ లక్ష్మి స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,225.43కోట్లు విడుదల చేసింది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.2,175కోట్లు కేటాయించింది. అందులో నుంచి 24,038 కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లకు నిధులు రిలీజ్ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Similar News
News October 25, 2025
ఆ తల్లి కన్నీటి మంటలను ఆర్పేదెవరు?

కర్నూలు <<18087387>>బస్సు ప్రమాదం<<>> ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. బాపట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గన్నమనేని ధాత్రి (27) మృతితో తల్లి వాణి ఒంటరైపోయారు. 2 ఏళ్ల కిందట అనారోగ్యంతో భర్త, ఇప్పుడు బిడ్డను పోగొట్టుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. నెల్లూరుకు చెందిన అనూష తన బిడ్డ మన్వితను కాపాడుకోవాలని తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలో కుమార్తెను గుండెలకు హత్తుకుని కాలిపోయిన దృశ్యం కన్నీళ్లు పెట్టిస్తోంది.
News October 25, 2025
టోల్‌ప్లాజాల వద్ద పాస్‌ల వివరాలతో బోర్డులు: NHAI

వాహనదారుల్లో అవగాహన, పారదర్శకత కోసం NHAI కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల వద్ద నెలవారీ, వార్షిక పాస్‌ల వివరాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. 30 రోజుల్లోపు పాస్‌ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పింది. ఈ మేరకు ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఇతర ప్రాంతాల్లో ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషల్లో వివరాలను ప్రదర్శించనున్నారు.
News October 25, 2025
నలభైల్లో ఇలా సులువుగా బరువు తగ్గండి

40ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పులు, జీవక్రియలు నెమ్మదించి చాలామంది మహిళలు బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వయసు పెరుగుతున్నా వర్కవుట్ చేయడం మానకూడదు. సుఖ నిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గడంతో పాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. వీటితోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.


