News August 23, 2024
అన్నవరంలో సత్యదేవుని సాక్షిగా ఒక్కటైన వంద జంటలు

అన్నవరం దేవస్థానంలో పెళ్లిసందడి నెలకొంది. స్వామి సన్నిధిలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ముహుర్తాల్లో దాదాపు వంద వివాహాలు జరిగాయి. సత్యగిరిపై విష్ణు సదన్, ఉచిత కల్యాణ మండపాలు, రత్నగిరిపై ఆలయ ప్రాంగణాలు, సీతారామ సత్రం, ప్రకాష్ సదన్, పాత, కొత్త సెంటినరీ కాటేజీ ప్రాంగణాల్లో వివాహాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Similar News
News August 23, 2025
రాజమండ్రి: దోమల నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ

రాజమండ్రిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ శుద్ధి లక్ష్యంగా స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. ఇందులో భాగంగా కంబాల చెరువు పార్కులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. డ్రోన్లతో మందులు పిచికారీ చేయడంతోపాటు, దోమల లార్వాలను తినే గాంబూసియా చేపలను చెరువులో వదిలారు. ఈ వినూత్న కార్యక్రమం పట్ల ఎమ్మెల్సీ హర్షం వ్యక్తం చేశారు.
News August 23, 2025
దేవరపల్లి: లారీ ఢీకొని సర్పంచ్ బుల్లారావు మృతి

దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదర మండలం రామన్నపాలెం సర్పంచ్ కూచిపూడి బుల్లారావు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బుల్లారావు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News August 23, 2025
రాజమండ్రి: వీడిన మర్డర్ మిస్టరీ.. ఐదుగురి అరెస్ట్

ధవళేశ్వరానికి చెందిన వేపాడ సతీశ్ (23) హత్య కేసు మిస్టరీ వీడింది. టూ టౌన్ సీఐ శివ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న కైలాస భూమి శ్మశాన వాటిక సమీపంలో మద్యం తాగుతుండగా ఓ వ్యక్తిగత వ్యవహారంపై జరిగిన గొడవలో బి. రాధాకాంత్‌తో పాటు నలుగురు కలిసి సతీశ్‌ను కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశారు. అనుమానాస్పద కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురి అరెస్టు చేశారు.