News August 23, 2024
ఏపీలో పెట్టుబడులకు ఆరియా గ్లోబల్ ఆసక్తి

APలో బయో సింథటిక్ వుడ్, హైడ్రో ఫాయిల్ బోట్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు స్పెయిన్‌కు చెందిన ఆరియా గ్లోబల్ సంస్థ ఆసక్తిగా ఉంది. రూ.300 కోట్ల పెట్టుబడితో లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే బోట్లను ఇండియన్ నేవీకి సరఫరా చేస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో భేటీలో వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో బయో సింథటిక్ వుడ్‌ను తయారు చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
Similar News
News January 4, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)నవీ ముంబైలో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 6) ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/B.Tech/BSc(Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ ఇంజినీర్లకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. ప్రాజెక్టు ఇంజినీర్లకు 32 ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి సడలింపు). ట్రైనీ Engg.కు JAN 16న, ప్రాజెక్ట్ Engg.కు JAN 20న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్సైట్: bel-india.in
News January 4, 2026
5 రోజులే పని చేస్తాం: బ్యాంక్ ఉద్యోగులు

బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ‘ప్రపంచమంతా వారానికి 4 రోజుల పని విధానం వైపు అడుగులేస్తుంటే బ్యాంకు ఎంప్లాయిస్ 24×7 పనిచేస్తున్నారు. 5 రోజుల పని విధానానికి ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ ఒప్పుకుంది. దీనిని ప్రభుత్వం ఆమోదించాలి’ అని పేర్కొంది. కాగా Xలో 5DayBankingNow హ్యాష్‌ట్యాగ్ ట్రెండవుతోంది.
News January 4, 2026
సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రైవేటు బస్సుల్లో ఛార్జీల మోత!

సంక్రాంతి సందడి మొదలవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది. కానీ ప్రస్తుతం కొన్ని ఏజెన్సీలు ₹2,700 నుంచి ₹4,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ట్రైన్ రిజర్వేషన్లు దొరకకపోవడంతో ప్యాసింజర్స్ ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్రావెల్స్ వారు సీటును బట్టి ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది.


