News August 23, 2024

ఫుడ్ క్వాలిటీగా లేదా? ఫిర్యాదులు చేయండిలా

image

TG: రాష్ట్రంలోని ఆస్పత్రులు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో క్వాలిటీ లేని ఫుడ్ సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు. ల్యాబ్‌ నుంచి రిపోర్ట్ రాగానే నోటీసులిస్తామన్నారు. ఆస్పత్రులు, హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం సర్వ్ చేస్తే diripmtg@gmail.com లేదా fssmutg@gmail.com, 9100105795, @cfs_telangana (ట్విటర్)లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News April 19, 2026

టాస్ గెలిచిన లక్నో

image

IPL: పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచులో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చంఢీఘర్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, వధేరా, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, అర్ష్‌దీప్, చాహల్.
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, బదోని, పూరన్, ముకుల్, షమీ, ఆవేశ్, సిద్దార్థ్, ప్రిన్స్, మోహ్‌సిన్.

News April 19, 2026

పుట్టగానే శిశువుకు ఫస్ట్ బర్త్ డే!

image

దక్షిణ కొరియాలో అప్పుడే పుట్టిన శిశువు వయసును ఏడాదిగా పరిగణించే వింత ఆచారం ఉండేది. గర్భస్థ కాలాన్ని కూడా లెక్కించడమే దీనికి కారణం. అలాగే ప్రతి JAN 1న అందరికీ వయసు పెరుగుతుంది. అంటే.. DEC 31న పుట్టిన బిడ్డకు మరుసటి రోజే రెండేళ్లు పూర్తవుతాయి. అయితే 2023 నుంచి ఈ పద్ధతిని అక్కడి ప్రభుత్వం మార్చింది. దీంతో అందరి వయసు తగ్గడం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(51/100)

News April 19, 2026

‘శారీరక అవసరాలు ఉంటే చెప్పు’.. TCS కేసులో సంచలన విషయాలు

image

TCS మతమార్పిడి కేసులో ఓ బాధితురాలు ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2025లో కంపెనీలో చేరిన కొత్తలో వేరే విభాగానికి చెందిన రెజా, ఆన్‌ జాబ్ ట్రైనింగ్‌లో ఆసిఫ్ అన్సారీ వేధించారని పేర్కొంది. ఉద్యోగ రీత్యా భర్తకు దూరంగా ఉంటున్న తనతో అసభ్యంగా మాట్లాడేవారని పేర్కొంది. ‘ఏమైనా శారీరక అవసరాలు ఉంటే చెప్పు. బుర్ఖా లేకనే మీ మతంలో ఆడవాళ్లు అత్యాచారానికి గురవుతున్నారు’ అని అన్సారీ వేధించాడని తెలిపింది.