News August 23, 2024

కమలా హారిస్ ఒక తోలుబొమ్మ: వివేక్ రామస్వామి

image

US అధ్యక్ష బరిలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇతరుల చేతిలో ఓ తోలుబొమ్మ మాత్రమేనని రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి విమర్శించారు. ఆమెకు ఆదరణ తగ్గుతుందన్న భయంతోనే విధానాల గురించి ఏమాత్రం మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ‘మా పార్టీ విధానాలతోనే గెలుస్తుంది. ఆమె విఫల ఆర్థిక విధానాల గురించి కూడా చర్చ జరగాలి. ఈ దేశాన్ని నడిపేందుకు ట్రంపే ‌సరైన వ్యక్తి’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 21, 2025

కోడిగుడ్డు తింటున్నారా?

image

బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతో చాలా మంది కోడిగుడ్డులోని పచ్చసొనను తినకుండా పారేస్తారు. కేవలం వైట్ మాత్రమే తింటారు. అయితే పచ్చసొనలో విటమిన్ A, D, E, B12, K, B2, B9 పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావం అయితే బ్లడ్ త్వరగా గడ్డకడుతుంది. చర్మం ఎప్పుడూ హెల్తీగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది.

News January 21, 2025

APSRTCకి కాసుల వర్షం

image

AP: సంక్రాంతి పండుగ భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న 3 రోజుల పాటు రోజుకు రూ.20కోట్లకు పైగా ఖజానాలో జమయ్యాయని తెలిపింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 9వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు వెల్లడించింది.

News January 21, 2025

ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జి.. బిల్ ఎంతంటే?

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. కాగా సైఫ్ ఆస్పత్రి పూర్తి బిల్లు రూ.40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ రూ.25 లక్షలు చెల్లించినట్లు సమాచారం. సైఫ్ నుంచి ఆస్పత్రి యాజమాన్యం రోజుకు రూ.7 లక్షలకుపైగా వసూలు చేసినట్లు టాక్. మరోవైపు సైఫ్‌ను రక్షించిన ఆటోడ్రైవర్‌కు ఓ సంస్థ రూ.11 వేల రివార్డు ప్రకటించింది.