News August 23, 2024

రాష్ట్రంలో మరో ప్రమాదం

image

AP: అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్ <<13912550>>ప్రమాదం<<>> మర్చిపోకముందే పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 12.30 గంటలకు రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News January 27, 2025

అంతరిక్షం నుంచి మహాకుంభమేళా ఫొటోలు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో ‘మహా కుంభమేళా’ వైభవంగా కొనసాగుతోంది. రోజూ కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాత్రి వేళ విద్యుత్ కాంతులతో ఉన్న మహాకుంభమేళా వైభవాన్ని ISSలో ఉన్న నాసా వ్యోమగామి డాన్ పెటిట్ ఫొటో తీశారు. ‘గంగా నది తీరంలో ప్రపంచంలోనే అతి పెద్ద మానవ సమ్మేళనం రాత్రివేళ వెలుగులీనుతోంది’ అని రాసుకొచ్చారు. ఈ చిత్రాలు వైరలవుతున్నాయి.

News January 27, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ.. రేపు టికెట్లు విడుదల

image

FEB 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు ICC వెల్లడించింది. PAK కాలమానం ప్రకారం మ.2 గంటలకు టికెట్లు <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంటాయంది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరిగే 10 మ్యాచ్‌ల టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. దుబాయ్ వేదికగా జరిగే IND మ్యాచ్‌ల టికెట్లను త్వరలో రిలీజ్ చేస్తామంది. ఫైనల్ మ్యాచ్(MAR 9) టికెట్లు 4 రోజుల ముందు అందుబాటులోకి వస్తాయంది.

News January 27, 2025

శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ సీజ్

image

TG: మాదాపూర్‌లో శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్‌‌ లైసెన్స్ రద్దు చేసిన అధికారులు తాజాగా కిచెన్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు ఆ ఫొటోలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ట్వీట్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో పలుమార్లు చేసిన తనిఖీల్లో పిల్లలకు నాసిరకం భోజనం అందిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే.