News August 23, 2024

కడప: నేటినుంచి అండర్ -23 క్రికెట్ టోర్నీ

image

కడపలోని YS రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ACA సౌత్ జోన్ అండర్-23 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్ రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు వారు తెలిపారు. టోర్నమెంట్‌లో సౌత్ జోన్‌కు చెందిన కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం పాల్గొంటున్నట్లు తెలిపారు.

Similar News

News March 11, 2026

వైవీయూ విద్యార్థి రేగులపాటి పునీత్ చిత్రానికి అవార్డ్

image

వైవీయు బీఎఫ్‌ఏ విద్యార్థి రేగులపాటి పునీత్ మెరిట్ అవార్డ్ సాధించారు. తమిళనాడులోని శ్రీ దర్శినికలై కోడం ఆర్ట్ కాలేజీ నిర్వహించిన 21వ జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో పునీత్ ఆక్రిలిక్ రంగుతో గీసిన “గ్రామీణ మహిళ “ చిత్రం ఎంపికయ్యింది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు చెన్నై లలితకళా అకాడమీ ఆర్ట్ గ్యాలరీలో చిత్రాన్ని ప్రదర్శిస్తారని ఫైన్ ఆర్ట్స్ హెడ్ మృత్యుంజయ రావు తెలిపారు.

News March 11, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,930
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,656
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720

News March 11, 2026

నేటి ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది హాజరు

image

కడప జిల్లాలో బుధవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి గణితం పరీక్ష 2,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,624 మంది పరీక్షలు రాశారు. 222 మంది ఆబ్సెంట్ అయ్యారు. హిస్టరీ పరీక్షకు 276 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 246 మంది వచ్చారు. 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.