News August 23, 2024
కమల అభ్యర్థిత్వంపై ట్రంప్ ఫస్ట్ రియాక్షన్

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి కమల హారిస్ అనర్హురాలంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. గత నాలుగేళ్లుగా వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షురాలి హోదాలో ఉండి తెచ్చిన సమస్యలకు పరిష్కారాల గురించి కమల ప్రసంగంలో ప్రస్తావించలేదని మండిపడ్డారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత వంటి ముఖ్యమైన సమస్యల గురించి ఆమె పెద్దగా మాట్లాడలేదని ఎత్తిచూపారు.
Similar News
News September 19, 2025
శాసనమండలి వాయిదా

AP: శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఆ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం ఎదుట నిరసనకు దిగారు. దీంతో శాసనమండలి వాయిదా పడింది.
News September 19, 2025
ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లు <<17674897>>వాహనమిత్ర <<>>పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. <<17731468>>అప్లికేషన్ ఫాంలను<<>> ఫిల్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి. వాటిపై సచివాలయ సిబ్బంది 22న క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. అర్హుల జాబితాను 24న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి దసరా పండుగ రోజున ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తారు.
News September 19, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరిగి రూ.1,11,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.150 ఎగబాకి రూ.1,02,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,43,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.