News August 23, 2024
జంగారెడ్డిగూడెం: మెసేజ్ పంపి రూ. లక్షలలో కాజేశారు

ఫోనుకు వచ్చిన లింకు తెరవగా ఖాతాలో నగదు మాయమైన ఘటనపై జంగారెడ్డిగూడెం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. స్టేషన్ రైటర్ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. పట్టణానికి చెందిన మోటేపల్లి రాజేంద్రప్రసాద్ ఫోనుకు ఈ నెల 7న ఓ లింకుతో కూడిన మెసేజ్ వచ్చింది. దానిపై క్లిక్ చేసిన కాసేపటి తరువాత అతని ఖాతాలో ఉన్న రూ.2 లక్షలు దఫదఫాలుగా మాయమైంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Similar News
News January 11, 2026
ప.గో: పందెపు బరుల ఏర్పాటు.. బౌన్సర్లతో భద్రత!

సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో కోడిపందాల బరుల ఏర్పాటు వేగవంతమైంది. పొలాలు, లేఅవుట్లను చదును చేసి, ప్రేక్షకుల కోసం భారీ గ్యాలరీలు, అతిథుల కోసం ప్రత్యేక విడిది సౌకర్యాలను నిర్మిస్తున్నారు. పందేల వద్ద గొడవలు జరగకుండా ముందస్తుగా ప్రైవేట్ బౌన్సర్లను సైతం నియమిస్తున్నారు. పండుగకు ముందే పందెం రాయుళ్ల హడావుడితో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయి.
News January 11, 2026
భీమవరంలో రౌడీయిజం.. మద్యం మత్తులో దాడి!

భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
News January 10, 2026
ప.గో: కోట్లల్లో పందేలు.. ఎందుకంటే!

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని స్పష్టం చేసినా, అటు భీమవరం.. ఇటు ఉండి నియోజకవర్గాల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో భవనం ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై జిల్లాలోని జూదరలు రూ.కోట్లలో పందాలు కాస్తుండటం చర్చనీయాంశంగా మారింది.


