News August 23, 2024
స్టైలిష్ లుక్‌లో షమీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724389171440-normal-WIFI.webp)
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. వన్డే ప్రపంచ కప్ తర్వాత కాలి మడమకు శస్త్ర చికిత్స జరగడంతో చాలా కాలం క్రికెట్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో తన పేస్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు. గతంలో బట్టతలతో కనిపించిన ఆయన ప్రస్తుతం పూర్తిగా మారిపోయి స్టైలిష్‌గా తయారయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
Similar News
News February 14, 2025
గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తూ భారతీయుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739468288557_1045-normal-WIFI.webp)
భారత్‌లోని మీరట్‌కు చెందిన మోహిత్ కోహ్లీ అనే సైక్లిస్ట్ చిలీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 10వేల కి.మీ దూరాన్ని సైకిల్‌పై అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలని భావించిన ఆయన దక్షిణ అమెరికాలో కొలంబియా నుంచి అర్జెంటీనాకు సైకిల్‌పై బయలుదేరారు. కొలంబియా, పెరూ, ఈక్వెడార్ దాటిన ఆయన చిలీలో ఓ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ వార్తతో మీరట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 14, 2025
HEADLINES TODAY
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739466883686_1045-normal-WIFI.webp)
AP: 2027 జూన్‌కల్లా పోలవరం పూర్తికావాలి: సీఎం చంద్రబాబు
AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన అవసరం లేదు: మంత్రి అచ్చెన్న
AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
TG: విభజన తర్వాత తెలంగాణ అప్పుల్లోకి: నిర్మల
TG: వైద్య సేవల్లో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు
TG: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ కేంద్రాలు
అమెరికా చేరుకున్న మోదీ, మస్క్‌తో భేటీ
పార్లమెంటులోకి ఆదాయ పన్ను కొత్త బిల్లు
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన
News February 14, 2025
12 ఏళ్లకే రాజుగా పట్టాభిషేకం.. 20వేల కోట్ల ఆస్తి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739451616920_746-normal-WIFI.webp)
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మహారాజా పద్మనాభ్ సింగ్‌కు 12ఏళ్ల వయసులోనే రాజుగా పట్టాభిషేకం జరిగింది. ప్రస్తుతం 26ఏళ్ల వయసులో రూ.20వేల కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. ఇంత డబ్బున్నా చదువుతో పాటు క్రీడలను వదల్లేదు. పోలో ఆటలో నైపుణ్యం సాధించి 2017లో IND జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. వారసత్వ కట్టడమైన సిటీ ప్యాలెస్‌ను పర్యాటకుల కోసం ఉంచారు. తల్లితో కలిసి మహిళలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు.