News August 23, 2024

కేరళ సీఎస్‌గా భర్త తర్వాత భార్య

image

కేరళ అధికార యంత్రాంగంలో ఆసక్తికర ఘటన జరిగింది. అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) పదవి భార్యాభర్తలిద్దరిని వరిస్తోంది. ప్రస్తుత CS వేణు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాతి రోజే ఆయన భార్య, స్థానిక స్వపరిపాలన శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ CSగా బాధ్యతలు చేపట్టనున్నారు. IAS దంపతులు CSగా నియమితులు కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇద్దరూ 1990 IAS బ్యాచ్‌కు చెందిన వారే.

Similar News

News November 5, 2025

హన్స్‌రాజ్ కాలేజీలో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ 24 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 21లోపు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, మిగతా పోస్టులకు 32ఏళ్లు. వెబ్‌సైట్: https://hansrajcollege.ac.in/

News November 5, 2025

నాకు బతికే అర్హత లేదు అంటూ హీలియం గ్యాస్ పీల్చి..

image

AP: ఇటీవల CA పరీక్షల్లో ఫెయిలైన విశాఖకు చెందిన అఖిల్ వెంకట కృష్ణ (29) అనే విద్యార్థి తల్లిదండ్రులకు భావోద్వేగపూరిత లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘మిమ్మల్ని మోసం చేశా. ఇక నాకు బతికే అర్హత లేదు, క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. నిన్న రాత్రి తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఇతడు గుంటూరులో సీఏ కోచింగ్ తీసుకున్నాడు.

News November 5, 2025

బైకులకు టోల్ ట్యాక్స్ ఎందుకుండదో తెలుసా?

image

నేషనల్ హైవేస్ టోల్ రూల్స్ 2008 రూల్ 4(4) ప్రకారం టూవీలర్స్‌ టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. కార్లు, హెవీ వెహికల్స్‌తో పోలిస్తే బైకులతో రోడ్లు ఎక్కువ డ్యామేజ్ కావు. బండి కొనేటప్పుడే రోడ్ ట్యాక్స్ కడతాం. దానినే పరోక్షంగా రోడ్లు, హైవేల నిర్వహణకు వాడతారు. బైక్‌పై టోల్ ట్యాక్స్ వేస్తే ఆదాయం కంటే.. డబ్బు వసూలు చేయడానికే ఎక్కువ ఖర్చవుతుంది. అంతకు మించి అన్ని టోల్స్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది.