News August 23, 2024

26న ఆట్యా పాట్యా జిల్లాస్థాయి ఎంపికలు

image

నకరికల్లులో 26న అండర్-18 ఆట్యా పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు శంకరభారతీపురం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు 1-01-2007 తర్వాత జన్మించిన వారై ఉండాలని, వయసు, ఎత్తు కలిపి బాలురు 250 నుంచి 260 వరకు, బాలికలైతే 230 నుంచి 240 వరకు ఇండెక్స్ కలిగి ఉండాలన్నారు. ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

Similar News

News September 18, 2025

బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బందోబస్తు సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ప్రముఖులతో మర్యాదగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో మాత్రం కఠినంగా ఉండాలని సూచించారు. ఏవైనా ఆకస్మిక ఘటనలు జరిగినప్పుడు పక్క సెక్టార్లలోని పోలీసులు సహాయం అందించాలని చెప్పారు.

News September 17, 2025

GNT: CM ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్

image

DSC నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం సమీక్షించారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర సచివాలయం దగ్గర DSCలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రాంగణంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో SP వకుల్ జిందాల్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, గుంటూరు RDO శ్రీనివాస రావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.

News September 17, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. మట్టి నమూనాల సేకరణ

image

హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించతలపెట్టిన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా, గుంటూరు జిల్లాలో ఫైనల్ లొకేషన్ సర్వే బుధవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. DPR రూపొందించడం, ఫైనల్ ఎలైన్‌మెంట్ డిజైన్ కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా, 20 మీటర్ల లోతులో ప్రతి 5 మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు.