News August 23, 2024

శ్రీవారి భక్తులకు శుభవార్త

image

శ్రీవారికి అంగప్రదక్షిణ చేసే భక్తులకు TTD శుభవార్త చెప్పింది. ఆగస్టు 24వ తేదీకి అదనంగా మరో 250 అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 23వ తేదీ 12 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల బుకింగ్‌కు అనుమతిస్తారు. శ్రీవారికి అంగప్రదక్షిణ చేస్తే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Similar News

News March 5, 2026

చిత్తూరులో జాతీయ జెండా ఎగిరి.. 30 రోజులకు పైనే

image

చిత్తూరు జిల్లా కేంద్రంలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరి ముచ్చటగా 30 రోజులకు పైనే అయింది. నగరంలోని గాంధీ కూడలి వద్ద “ఐ లవ్ చిత్తూరు” పార్కులో భారీ ఎత్తులో జాతీయ జెండా స్తంభం ఏర్పాటుచేసి అందులో జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు జెండాను ఘనంగా ఆవిష్కరించిన అనంతరం దాదాపు జాతీయ జెండా ఎగరలేదు. స్తంభం మాత్రమే దర్శనమిస్తోంది. మన జాతీయ జెండా ఎగరడానికి దృష్టి పెట్టండి సారూ.!

News March 5, 2026

పెనుమూరు: బైక్‌లు ఢీ.. ఒకరి మృతి

image

ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుమూరు మండలంలో జరిగింది. పెనుమూరు మండలం స్వామి రెడ్డి పల్లికి చెందిన గోవిందు బైక్‌పై వస్తుండగా.. పాకాల మండలానికి చెందిన బాబు, రెడ్డప్ప ఆచారి మరొక బైక్‌పై వస్తూ చార్వగాని పల్లె సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో గోవిందు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 4, 2026

చిత్తూరు: ఇంట్లోనే నాటు తుపాకుల తయారీ..!

image

అప్పట్లో అక్రమ తయారీదారులు ఒక్కో <<19299453>>తుపాకి<<>>ని రూ.7-10 వేల వరకు విక్రయించే వారు. కొన్నాళ్లుగా ఈ తుపాకుల జాడలేకున్నా తాజా ఘటనతో చిత్తూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కొందరు సోషల్ మీడియాను ఉపయోగించి ఇంట్లోనే నాటు తుపాకులు తయారు చేసుకొనే అవకాశం లేకపోలేదు. పలమనేరు, మదనపల్లె, పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లో నాటు తుపాకీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే ఎన్ని తుపాకులు బయటకు వస్తాయో చూడాలి.