News August 23, 2024

పెద్దపల్లి: ప్రతి ఇంట్లో పేషంట్లే!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో చికున్ గున్యా పంజా విసురుతోంది. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్లందరికీ జ్వరం వస్తోంది. కీళ్ల నొప్పులతో మంచం పట్టి, లేవలేని పరిస్థితి. ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రిలో ప్రతిరోజూ 60 నుంచి 70 మందికి రక్త పరీక్షలు చేస్తున్నారు.

Similar News

News January 19, 2026

చల్లూరులోనే ఇసుక తవ్వకాలు.. నివేదిక సమర్పించిన కమిటీ

image

వీణవంక మండలం చల్లూరులో అనుమతి పొంది, ఇప్పలపల్లి గ్రామ పరిధిలో ఇసుక తవ్వుతున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని విచారణ కమిటీ తేల్చింది. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో ఏడుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. డీజీపీఎస్ సర్వే ప్రకారం చల్లూరు పరిధిలోనే మైనింగ్ జరిగిందని, ఇప్పలపల్లిలో అక్రమ తవ్వకాలు జరగలేదని నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బావులను తొలగించారని, నిబంధనలు పాటించాలన్నారు.

News January 19, 2026

కరీంనగర్ ప్రజావాణిలో 250 దరఖాస్తుల స్వీకరణ

image

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 250 దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని బదిలీ చేశారు.

News January 19, 2026

ప్రతి పాఠశాలను సందర్శించాలి: కరీంనగర్ కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలోని ప్రతి పాఠశాలను ప్రత్యేక అధికారులు ఈ నెలాఖరులోపు సందర్శించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పదోతరగతి పరీక్షల సన్నద్ధత, మధ్యాహ్న భోజన నాణ్యత, తాగునీరు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. గ్యాస్ కనెక్షన్లు, విటమిన్ గార్డెన్ల నిర్వహణపై దృష్టిసారించాలని, సమస్యలను తమ దృష్టికి తేవాలన్నారు.