News August 23, 2024
అనిల్ అంబానీకి షాక్ ఇచ్చిన సెబీ

నిధుల మళ్లింపు కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(RHFL) మాజీ ఉద్యోగులు, 24 సంస్థలపై సెబీ నిషేధం విధించింది. ఐదేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనవద్దని ఆదేశించింది. అనిల్ అంబానీపై రూ.25 కోట్ల ఫైన్ వేసింది. లిస్టెడ్ కంపెనీల్లో ఎలాంటి కీలక హోదాల్లో కొనసాగకూడదని స్పష్టం చేసింది. ఉద్యోగుల సాయంతో RHFL నిధులను అనిల్ అనుబంధ సంస్థలకు రుణాలుగా మళ్లించినట్టు సెబీ తెలిపింది.
Similar News
News January 26, 2026
కడప: ఇన్‌స్టాతో పరిచయం.. లాడ్జిలో యువతిపై అత్యాచారం

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. అలిపిరి CI రామ్ కిశోర్ వివరాల మేరకు.. కడప(D) బద్వేల్‌కు చెందిన యశ్వంత్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. ఇన్‌స్టా ద్వారా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆమెను మాయమాటలతో హోమ్‌స్టేకు పిలిపించిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్‌కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్‌ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్‌లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్‌కు బ్రాండ్‌ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


