News August 23, 2024

మూగజీవాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం శోచనీయం: హరీశ్ రావు

image

TG: మూగజీవాల సంరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. ‘ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి ఉంది. 9 నెలలుగా మందులు లేక పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయి. 1962 పశువైద్య సంచార వాహనాల నిర్వహణను గాలికొదిలేశారు. వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించాలి. 1962 వాహనాల్లో విధులు నిర్వర్తించే వారికి సకాలంలో జీతాలు ఇవ్వాలి’ అని CM రేవంత్‌ను డిమాండ్ చేశారు.

Similar News

News January 26, 2025

విజయ్ చివరి మూవీ టైటిల్ ఇదే

image

తమిళ హీరో విజయ్ నటించనున్న చివరి మూవీకి ‘జన నాయగన్’ టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని తెలుపుతూ హీరో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టర్ షేర్ చేశారు. బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ మూవీకి వినోద్ దర్శకుడు. TVK పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించిన ఇళయ దళపతి సందేశాత్మక చిత్రంతో సినీ కెరీర్ ముగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

News January 26, 2025

మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

image

నీటి కింది నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా తాజాగా పరీక్షించింది. ఆ దేశ అధికారిక మీడియా KNCA ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రయోగాన్ని దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారని పేర్కొంది. ఈ క్షిపణి ప్రయోగం విజయంతో తమ సైన్యం మరింత బలోపేతమైందని హర్షం వ్యక్తం చేసింది. మున్ముందు మరింత బలంగా మారతామని, శత్రువులకు తగిన సమాధానమిస్తామని స్పష్టం చేసింది.

News January 26, 2025

12 రోజుల్లో రూ.260కోట్లకు పైగా కలెక్షన్స్

image

విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఒక ప్రాంతీయ సినిమాకు ఇవే అత్యధిక వసూళ్లు అని పేర్కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.