News August 23, 2024
ALERT: రాష్ట్రంలో భారీ వర్షాలు
TG: రాష్ట్రంలో నేటి నుంచి 27వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, MBNR, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది.
Similar News
News January 26, 2025
ప్లాన్ ప్రకారమే ఆ బౌలర్‌ని టార్గెట్ చేశాను: తిలక్
ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చెలరేగిన సంగతి తెలిసిందే. 72 రన్స్ చేసిన వర్మ, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ బౌలింగ్‌లో 4 సిక్సులు కొట్టడంపై మ్యాచ్ అనంతరం వివరించారు. ‘ప్రత్యర్థి జట్టులో బెస్ట్ బౌలర్‌ను టార్గెట్ చేయాలని ముందే అనుకున్నా. లక్కీగా షాట్స్ వర్కవుట్ అయ్యాయి. జట్టును గెలిపించాలన్న పట్టుదలతో ఆడాను’ అని స్పష్టం చేశారు.
News January 26, 2025
పెరిగిన చికెన్ ధర
TG: రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలున్నా చాలాచోట్ల తెరిచే ఉన్నాయి. ఆదివారం కావడంతో ప్రజలు కూడా భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గత వారం వరకు కేజీ చికెన్ ధర రూ.230-240 ఉండగా ఇవాళ రూ.280-300కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ.250లోపే పలుకుతోంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
News January 26, 2025
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.