News August 23, 2024
13 ఏళ్లుగా అతను భార్య కోసం వెతుకుతున్నాడు
సునామీలో కొట్టుకుపోయిన భార్య కోసం ఓ వ్యక్తి గత 13 ఏళ్లుగా సముద్రాన్ని జల్లెడపడుతున్నాడు. జపాన్‌కు చెందిన యసువో తకమట్సు భార్య యుకో 2011 జపాన్ సునామీలో కొట్టుకుపోయింది. భార్య అవశేషాలు ఇక దొరకవని తెలిసినా ఆమె మీద ప్రేమతో అలుపెరగని అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. డీప్ డైవర్స్ ద్వారా ఈతలో శిక్షణ పొంది మరీ తన వెతుకులాటను కొనసాగిస్తుండడంతో అందరూ అతనిపై సానుభూతిని ప్రకటిస్తున్నారు.
Similar News
News January 26, 2025
మువ్వన్నెల వెలుగుల్లో సెక్రటేరియట్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ భవనాన్ని కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ భవనం మువ్వన్నెల విద్యుద్దీపాలతో కాంతులీనింది. నిన్న రాత్రి తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News January 26, 2025
మన తొలి ‘రిపబ్లిక్ డే’కు అతిథి ఎవరంటే..
ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మన తొలి రిపబ్లిక్ డేకు కూడా ఇండోనేషియా అధ్యక్షుడే చీఫ్ గెస్ట్ కావడం విశేషం. 1950లో ఇర్విన్ యాంఫీ థియేటర్లో నిర్వహించిన వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆ దేశానికి స్వాతంత్ర్యం దక్కడంలో భారత్ అండగా నిలిచింది.
News January 26, 2025
సింగర్‌తో సిరాజ్.. ఫొటోతో డేటింగ్ రూమర్స్
టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనై భోస్లే దిగిన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జనై ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తన బర్త్‌డే సెలబ్రేషన్ ఫొటోల్లో హైదరాబాదీతో క్యాండిడ్ ఉంది. దీంతో ఫాస్ట్ బౌలర్‌తో ఆశా భోస్లే మనవరాలు డేటింగ్‌లో ఉందనే కామెంట్లు గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరి వైపు నుంచి ఏ స్టేట్‌మెంట్ రాలేదు.