News August 23, 2024

కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: పొంగులేటి

image

TG: గత పదేళ్లలో రూ.11వేల కోట్లు కూడా మాఫీ చేయని BRSకు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రెండుసార్లు రైతులను మోసం చేసిందని ఆరోపించారు. తాము అలా కాదని, అర్హులైన అందరికీ రుణాలు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.2లక్షల పైన రుణం ఉన్నవారు ఆపై మొత్తాన్ని చెల్లిస్తే రూ.2లక్షలు మాఫీ చేస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

Similar News

News January 26, 2025

సింగర్‌తో సిరాజ్.. ఫొటోతో డేటింగ్ రూమర్స్

image

టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనై భోస్లే దిగిన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జనై ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తన బర్త్‌డే సెలబ్రేషన్ ఫొటోల్లో హైదరాబాదీతో క్యాండిడ్ ఉంది. దీంతో ఫాస్ట్ బౌలర్‌తో ఆశా భోస్లే మనవరాలు డేటింగ్‌లో ఉందనే కామెంట్లు గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరి వైపు నుంచి ఏ స్టేట్‌మెంట్ రాలేదు.

News January 26, 2025

విజయ్ చివరి మూవీ టైటిల్ ఇదే

image

తమిళ హీరో విజయ్ నటించనున్న చివరి మూవీకి ‘జన నాయగన్’ టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని తెలుపుతూ హీరో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టర్ షేర్ చేశారు. బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ మూవీకి వినోద్ దర్శకుడు. TVK పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించిన ఇళయ దళపతి సందేశాత్మక చిత్రంతో సినీ కెరీర్ ముగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

News January 26, 2025

మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

image

నీటి కింది నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా తాజాగా పరీక్షించింది. ఆ దేశ అధికారిక మీడియా KNCA ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రయోగాన్ని దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారని పేర్కొంది. ఈ క్షిపణి ప్రయోగం విజయంతో తమ సైన్యం మరింత బలోపేతమైందని హర్షం వ్యక్తం చేసింది. మున్ముందు మరింత బలంగా మారతామని, శత్రువులకు తగిన సమాధానమిస్తామని స్పష్టం చేసింది.