News August 23, 2024

మసీదును ప్రారంభించిన మంత్రి ఫరూక్

image

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన మసీదును మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని అన్నారు. మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి మదరసాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

Similar News

News March 11, 2026

OTPలు ఎవరికీ చెప్పకండి: జేసీ

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు RBI రూపొందించిన పోస్టర్లను జేసీ నూరుల్ ఖమర్ ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ.. ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు ‘డిజిటల్ పేమెంట్స్ అవేర్నెస్ వీక్’ నిర్వహిస్తున్నామన్నారు. బ్యాంక్ అధికారులమని చెప్పినా ఎవరికీ OTP చెప్పకూడదన్నారు. కేవలం బ్యాంక్ అధికారిక యాప్స్, వెబ్‌సైట్ల ద్వారానే లావాదేవీలు చేయాలన్నారు.

News March 10, 2026

కర్నూలు: రూ.14,740 కోట్ల రుణ ప్రణాళిక విడుదల

image

KNL కలెక్టరేట్‌లో నాబార్డు రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సరపు పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని జేసి నూరుల్ ఖమర్ మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి బ్యాంకులు వెన్నుదన్నుగా నిలవాలన్నరు. మొత్తం రుణ అంచనా రూ.14,740 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.9,283 కోట్లు, విద్యా రుణాలు రూ.203 కోట్లు, MSME 3,653 కోట్లు, గృహ రుణాలు రూ.287 కోట్లుగా నాబార్డు అంచనా వేసింది.

News March 10, 2026

కర్నూలు నగరపాలక సంస్థకు స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ సిరి

image

కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ ఏ.సిరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కమిషనర్ విశ్వనాథ్‌ను నందికొట్కూరుకు, కర్నూలు ఆర్డీవోను గూడూరుకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆదోనికి జాయింట్ కలెక్టర్, ఎమ్మిగనూరుకు స్థానిక ఆర్డీవోను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.