News August 23, 2024
దేశ ప్రజల కోసం టంగుటూరి ఎంతో శ్రమించారు: ఎస్పీ

దేశ ప్రజల కోసం టంగుటూరి ప్రకాశం పంతులు ఎంతో శ్రమించారని ఎస్పీ రత్న పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించి, ఎన్నో సవాళ్లను అధిగమించి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.
Similar News
News April 4, 2026
6న అనంతపురానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక

ఏప్రిల్ 6న అనంతపురం నగరానికి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రానున్నారు. అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నిర్వహించే 15వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో ఆయన హాజరుకానున్నట్లు వైస్ ఛాన్సలర్ హంచాటే సుదర్శనరావు తెలిపారు. స్నాతకోత్సవానికి సంబంధించి ఇప్పటికే యూనివర్సిటీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News April 3, 2026
నార్పలలో మత్తుమందు చల్లి దొంగతనం

నార్పలలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. గూగూడు రోడ్డులో ఉన్న మల్లికార్జున డ్రిప్పుల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తి రూ.500కు చిల్లర కావాలని అడిగి యజమానిపై మత్తుమందు చెల్లి రూ.45 వేలు దోచుకెళ్లాడు. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాగర్ షాపులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. త్వరలోనే దొంగను అదుపులోకి తీసుకొని బాధితుడికి న్యాయం చేస్తామని ఎస్ఐ తెలిపారు.
News April 3, 2026
పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన

అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. మొత్తం 575 పంచాయతీలు ఉండగా, గతంలోనే ఎన్నికలు జరగని ఏ.నారాయణపురం, పామిడిలకు పాత అధికారులే కొనసాగుతారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రత్యేక అధికారుల జాబితాకు ఆయన ఆమోదముద్ర వేశారు. మండలాల్లో ఒక్కో అధికారికి రెండు నుంచి ఆరు పంచాయతీల బాధ్యతలను అప్పగించినట్లు కలెక్టర్ వెల్లడించారు.


