News August 23, 2024
గుర్ల: బ్యాంక్ మేడ పైన మృతదేహం కలకలం..

విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో గల విశాఖ గ్రామీణ బ్యాంక్ మేడ మీద గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించారు. ప్యాంట్, చారలు షర్ట్ వేసుకున్న వ్యక్తి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని, అది హత్యా, లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతుడు వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
Similar News
News October 1, 2025
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం: సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కూడా గత పాలకులు ఆలస్యం చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని, 2026 ఆగస్టుకు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు.
News October 1, 2025
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో తూర్పు భాగవతానికి చోటు

ఇన్క్రెడిబుల్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో తూర్పు భాగవతానికి చోటు లభించింది. బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బొంతలకోటి శంకరరావు తూర్పు భాగవతం ప్రదర్శన చేయడంతో పాటు కళను బతికించేందుకు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి చిన్నారులకు ఉచితంగా నేర్పిస్తున్నారు. తండ్రి నుంచి నేర్చుకున్న కళను భవిష్యత్ తరాలకు అందించాలని ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నట్లు శంకరరావు చెప్పారు.
News October 1, 2025
సీఎం పర్యటన.. 600 మందితో బందోబస్తు: VZM SP

సీఎం చంద్రబాబు బుధవారం దత్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ దామోదర్ హెలిప్యాడ్, సభాస్థలం, కాన్వాయ్ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సుమారు 600 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామానికి వెళ్లే రహదారులు చిన్నవిగా ఉండటంతో వాహనాలు రహదారిపై నిలపకుండా చర్యలు చేపట్టాలన్నారు.