News August 23, 2024
NGKL: మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై స్పందించిన మహిళా కమిషన్
సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీపై వాస్తవ పరిస్థితి ఏంటనే విషయమై తెలుసుకునేందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయరెడ్డి వెళ్లగా వారిపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శారద ఈరోజు HYD నుంచి నాగర్‌కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారు. జరిగిన విషయాన్ని తనకు తెలియజేయాలని లేఖ ద్వారా కోరారు.
Similar News
News November 18, 2024
అలంపూర్ ఆలయాల్లో భక్తుల రద్దీ
కార్తీక సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లాలోని సోమశిల, బీచుపల్లి, మల్దకల్, ఉమామహేశ్వరం, అలంపురం, మన్యంకొండ వంటి పలు పుణ్యక్షేత్రాల్లో భక్తులు రద్దీ నెలకొంది. సంబంధిత దేవస్థానాలు ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేసి భక్తులను దర్శనానికి క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్‌లో భక్తులకు మంచినీరు కూడా అందించాలని హిందూ ధార్మిక సేన ప్రతినిధులు దేవాదాయ శాఖ వారిని కోరారు.
News November 18, 2024
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో స్నేహితులు దుర్మరణం
HYD- శ్రీశైలం హైవేపై కడ్తాల్ టోల్ గేట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కడ్తాల్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు రాజు, మహేశ్ మైసిగండి నుంచి కడ్తాల్ వైపు బైక్ పై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్నేహితులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర వషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 18, 2024
నేడు లగాచర్లకు జాతీయ ST కమిషన్ మెంబర్
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగాచర్లకు జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10గంటలకు లగాచర్లకు చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడి మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమావేశం అవుతారు. సాం. 4 గంటలకు సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులతో మాట్లాడి హైదరాబాద్ వెళ్తారు.