News August 23, 2024
SL, NZ మధ్య 6 రోజుల టెస్ట్.. ఎందుకంటే?

అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు మ్యాచ్ సాధారణంగా 5 రోజులు ఉంటుంది. కానీ శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య 6 రోజుల టెస్ట్ జరగనుంది. కాకపోతే మధ్యలో ఒక రెస్ట్ డే ఉంటుంది. శ్రీలంకలోని గాలే వేదికగా తొలి టెస్ట్ Sept 18న ప్రారంభమై 23న ముగియనుంది. 21న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆ రోజున ‘రెస్ట్ డే’గా పరిగణించి ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటారు. గతంలో టెస్టు మధ్యలో వచ్చే ఆదివారాన్ని రెస్ట్ డే అనేవారు.
Similar News
News March 5, 2026
శుభ సమయం (5-3-2026) గురువారం

➤ తిథి: బహుళ విదియ సా.4.43 వరకు తదుపరి తదియ ➤ నక్షత్రం: ఉత్తర ఉ.8.13 వరకు, తదుపరి హస్త ➤ శుభ సమయాలు: ఉ.6.17-7.15, ఉ.9.13-10.10, ఉ.10.59-మ.12.09, మ.1.07-2.06, సా.4.04-4.59 వరకు ➤ రాహుకాలం: మ.1.30-3.00 వరకు ➤ యమగండం: ఉ.6.00-7.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.10.11-10.58, మ.2.53-3.40 వరకు ➤ వర్జ్యం: సా.5.00-రా.6.40 వరకు ➤ అమృత ఘడియలు: తె.3.02 నుంచి 4.42 వరకు
News March 5, 2026
TODAY HEADLINES

* ఇరాన్ యుద్ధ నౌకపై US దాడి.. 100 మంది మృతి
* AP, TG.. రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల
* AP: 30,588 GOVT ఉద్యోగాలు ఇచ్చాం: CBN
* AP: దివ్యాంగులకు ఫ్రీ జర్నీ.. 18న ప్రారంభం
* AP: నెయ్యి సరఫరాలో CBN స్కామ్‌లు: జగన్
* TG: RS అభ్యర్థులుగా సింఘ్వీ, నరేందర్ రెడ్డి
* TG: టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు: KK
* TG: త్వరలో ఢిల్లీకి KCR.. రాజకీయ మిత్రులతో భేటీ?
* సెమీస్‌లో SAపై NZ విజయం.. ఫైనల్‌కు చేరిక
News March 5, 2026
ఏం కొట్టావయ్యా అలెన్..

T20WC సెమీస్‌లో SAపై న్యూజిలాండ్ ఓపెనర్ <<19299856>>ఫిన్ అలెన్<<>> విధ్వంసం సృష్టించారు. 33 బంతుల్లోనే శతకం బాదారు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. T20WCలో, ఫుల్ మెంబర్ టీమ్‌పై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2016లో ఇంగ్లండ్‌పై గేల్(WI) 47 బంతుల్లో మూడంకెల స్కోర్ బాదారు. ఓవరాల్‌గా T20Iలలో మూడో వేగవంతమైన శతకం. 2024లో సాహిల్(ఎస్టోనియా)vsసైప్రస్‌పై 27 బంతుల్లో, ఫహాద్(తుర్కియే)vsబల్గేరియాపై 29 బాల్స్‌లో సెంచరీ చేశారు.


