News August 23, 2024
గిద్దలూరులో రైల్వేట్రాక్‌పై మహిళ మృతదేహం

గిద్దలూరులో రైలు పట్టాలపై శుక్రవారం ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. పట్టణ శివారులోని ఆర్మీ క్యాంటీన్ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మహిళ మృతి చెంది పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా..?, రైలు ఢీకొట్టిందా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 12, 2026
ప్రకాశం: వడగాల్పుల వేళ ముందస్తు చర్యలు

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.
News March 11, 2026
రేపు కనిగిరిలో జాబ్ మేళా..!

కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ,బీ.టెక్, తదితర కోర్సులు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 18 నుంచి 26 సంవత్సరాల లోపు వారు ఆధార్ కార్డు, టీసీ, మార్క్ లిస్ట్, 2 పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.
News March 11, 2026
ప్రకాశం: వడగాల్పులపై ముందస్తు చర్యలు