News August 23, 2024

BREAKING: HYD: ఏసీబీ వలకు చిక్కిన మరో అధికారిణి..!

image

HYDలో ACB ఆకస్మిక దాడులు కొనసాగిస్తోంది. నేడు నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి బి.వసంత ఇందిరా రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు, నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అకౌంట్లకు సంబంధించిన ఓ విషయమై ఆమె లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News January 16, 2026

ఇది HYD మెట్రో ప్రయాణికుల కోసం!

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు విజ్ఞప్తి. L&T మెట్రో రైల్ కొత్తగా సర్వే చేస్తోంది. పై ఫొటోలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చింది. దీని వలన ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేయడానికి సాయం చేస్తుందని పేర్కొంది. నిత్యం మెట్రోలో ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.

News January 16, 2026

హైదరాబాద్ TIMS.. హెల్త్ హబ్‌ కోసమే! (1)

image

హైదరాబాద్ నగరాన్ని హెల్త్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఏప్రిల్ 2022లో ఈ మెగా ప్రాజెక్టుకు పునాది పడింది. నగరం నలువైపులా (సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్, గచ్చిబౌలి) సుమారు రూ.4,400 కోట్లతో నిర్మిస్తున్న 4 అత్యాధునిక ఆసుపత్రుల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, అధికారం మారడం, నిధుల విడుదల, పరికరాల సేకరణలో జాప్యం వల్ల ఈ ప్రాజెక్టు గడువులు నిరంతరం మారుతూ వస్తున్నాయి.

News January 16, 2026

ఫోర్త్ సిటీలో ఎగిరే టాక్సీలు.. స్కైరైడ్ సిద్ధం!

image

HYDకు ఎగిరే టాక్సీలు రానున్నాయి. ఫోర్త్ సిటీలో ఈ ‘వర్టిపోర్ట్స్’ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విమానాలకు రన్-వే కావాలి. కానీ ఈ ఎయిర్ టాక్సీలు (eVTOL) హెలికాప్టర్ లాగా నిలువుగాపైకి లేస్తాయి, కిందకు దిగుతాయి. అందుకే వీటికి ఎయిర్‌పోర్ట్ అవసరం లేదు. ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్‌లు కూడా. యాప్‌లో బుక్ చేస్తే ఇంటి మీద ఆగుతాయి. ఫోర్త్ సిటీనుంచి 10MINలో సైలెంట్‌గా ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చు.