News August 23, 2024
విండోస్‌లో ఇకపై నో కంట్రోల్ ప్యానల్!

దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన విండోస్ OSలోని కంట్రోల్ ప్యానల్‌ని సెట్టింగ్స్ ఆప్షన్‌తో రీప్లేస్ చేయనుంది. ఈ ఆప్షన్ అనవసరం అనే అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 1985లో వచ్చిన విండోస్ 1.0 వెర్షన్ నుంచి కంట్రోల్ ప్యానల్ యూజర్లకు సుపరిచితం. విండోస్ 11లోనూ దీనిని కొనసాగించారు. 2012లో వచ్చిన విండోస్ 8 వెర్షన్ నుంచి OS ఇంటర్‌ఫేస్‌లలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.
Similar News
News December 27, 2025
నేటి నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) హాల్ టికెట్లు ఇవాళ 11am తర్వాత వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పారు. అభ్యర్థులు <
News December 27, 2025
MSMEలకు పెరుగుతున్న రుణ వితరణ

దేశంలోని MSMEలకు బ్యాంకులు, NBFCలు తదితరాల నుంచి రుణ వితరణ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సెప్టెంబర్ నాటికి 16% పెరిగి రూ.46లక్షల కోట్లకు చేరింది. యాక్టివ్ లోన్ ఖాతాలూ 11.8% పెరిగి 7.3 కోట్లకు చేరాయి. కేంద్ర రుణ పథకాలతో పాటు విధానపరమైన మద్దతు దీనికి కారణంగా తెలుస్తోంది. గత రెండేళ్లలో MSME రుణ చెల్లింపుల్లో కూడా వృద్ధి కనిపించింది. 91-180 రోజుల ఓవర్ డ్యూ అయిన లోన్లు 1.7% నుంచి 1.4%కి తగ్గాయి.
News December 27, 2025
శనివారం రోజు చేయకూడని పనులివే..

శనిదేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శనివారం రోజున జుట్టు, గోర్లు కత్తిరించడం, ఉప్పు, నూనె, ఇనుము, నల్ల మినపప్పు వంటి వస్తువులను కొనడం మానుకోవాలని పండితులు చెబుతున్నారు. మాంసం, మద్యానికి దూరంగా ఉంటూ పేదలను, నిస్సహాయులను వేధించకుండా ఉండాలని సూచిస్తున్నారు. ‘కూతురిని అత్తారింటికి పంపకూడదు. నూనె, నల్ల మినపప్పు దానం చేయాలి. ఫలితంగా శని ప్రభావం తగ్గి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి’ అంటున్నారు.


