News August 23, 2024
పబ్జి గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారు: మంత్రి సవిత

రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్‌దే అని మంత్రి సవిత అన్నారు. శుక్రవారం అమరావతిలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారని విమర్శించారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే అచ్యుతాపురంలోని ఎసెన్షియాలో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఇకనైనా జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని సవిత హితవు పలికారు.
Similar News
News March 26, 2026
మార్కాపురం ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని అన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News March 26, 2026
GNT: ముగ్గురు స్నేహితులకు 10 ఏళ్ల జైలు..!

గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు హన్మకొండ న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లక్ష్మణరావు(పేరేచర్ల) చైతన్య కుమార్ (పిడుగురాళ్ల), సైదులు(కారంపూడి) ముగ్గురు స్నేహితులు. వీరంతా ఆల్ప్రాజోలం మాత్రలతో కేజీ పొడిని తయారు చేసి న్యూఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు 2023లో హైదరాబాద్ బయల్దేరగా అప్పట్లో హన్మకొండ పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది.
News March 25, 2026
ఉండవల్లి: మంత్రి లోకేశ్‌ను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలు

ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ను ఏపీ జేఏసీ ఛైర్మన్, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ బుధవారం కలిశారు. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం పట్ల మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రుల బృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జేఏసీ నేతలు స్వాగతించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.


