News August 23, 2024
కోల్‌కతా వైద్యురాలి కొలీగ్స్‌కు లై డిటెక్టర్ టెస్టులు!
ఆర్జీ కర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో CBI వేగం పెంచింది. ఆమెతో కలిసి పనిచేసిన ఇద్దరు ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్న్‌కు లై డిటెక్టర్ టెస్టులు చేయనుంది. వారిచ్చిన వాంగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిసింది. నేరంతో వారికి సంబంధం లేదని భావిస్తున్నా సాక్ష్యాధారాల చెరిపివేత, కుట్రలో భాగముందా అనే కోణాల్ని CBI పరిశీలిస్తోంది. ఆ రాత్రి జరిగిన పరిణామాల వరుస క్రమంపై అవగాహనకు వచ్చింది.
Similar News
News January 15, 2025
మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్, ఆయన సతీమణి రెబెకా ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తమకు బాబు పుట్టబోతున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లబుషేన్ పోస్ట్ పెట్టారు. ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అని పేర్కొన్నారు. లబుషేన్, రెబెకాకు 2017 వివాహం జరగగా, 2022లో కూతురు హాలీ జన్మించింది.
News January 15, 2025
SHOCK: టీవీల్లో ‘గేమ్ ఛేంజర్’!
‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్లు తెలుస్తోంది. ‘AP LOCAL TV’ ఛానల్లో పైరసీ HD ప్రింట్ ప్రసారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు X వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. కాగా ఈ సినిమా విడుదలకు ముందే కుట్రలు జరిగాయని మూవీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News January 15, 2025
ఒక్కరోజులో 5626% పెరిగిన ట్రంప్ కాయిన్!
US ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఒక క్రిప్టో కాయిన్ ఉందని తెలుసా! దానిపేరు First Crypto President. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ DTC మార్కెట్ విలువ $141.5M. మొత్తం సప్లై వంద కోట్ల కాయిన్లు. గత 24 గంటల్లో ఇది ఏకంగా 5626% పెరిగింది. $0.0003321 నుంచి $0.01800కు చేరుకుంది. భారత కరెన్సీలో ఇప్పుడు రూ.1.53 పలుకుతోంది. MAGA, WLFI, $POTUS, $DJT సైతం ట్రంప్‌తో సంబంధం ఉన్నవే.