News August 23, 2024

హార్దిక్-నటాషా విడిపోవడానికి కారణమిదేనా?

image

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ వెల్లడించలేదు. అయితే హార్దిక్ ఆడంబరం, తన లైఫ్ స్టైల్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం విడాకులకు కారణమని వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్‌నౌ పేర్కొంది. స్వతంత్రంగా ఉండాలనుకునే నటాషాకు, హార్దిక్ ‘లివింగ్ లైఫ్ కింగ్ సైజ్’ మెంటాలిటీకి మధ్య ఏర్పడిన గ్యాప్ విడాకులకు దారి తీసి ఉండొచ్చంది.

Similar News

News March 16, 2026

రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండదు: CM

image

TG: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ సూచించారు. ‘అనవసర వివాదాల్లో ఇరుక్కోవద్దు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండదు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాపే వచ్చే ఎన్నికలకు అజెండా అవుతుంది’ అని దిశానిర్దేశం చేశారు.

News March 16, 2026

క్యాన్సర్‌తో ప్రతి 18నిమిషాలకు ఒకరు మృతి

image

తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యాన్సర్ కేసు నమోదవుతుండగా, ప్రతి 18 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. 2025లో రాష్ట్రవ్యాప్తంగా 53,565 కొత్త కేసులు, 29,300 మరణాలు సంభవించాయి. దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ ముప్పు 15% ఎక్కువగా ఉంది. పొగాకు వాడకం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులే ఇందుకు ముఖ్య కారణాలు.

News March 16, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹2,240 తగ్గి ₹1,57,420కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹2,050 తగ్గి ₹1,44,300 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర ఈరోజు ₹4వేలు తగ్గి ₹2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండొచ్చు.