News August 23, 2024
పిల్లల్ని ఇన్‌స్టాగ్రామ్ నుంచి రక్షించండిలా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే అడల్ట్ కంటెంట్ పిల్లల్ని చెడుదారిలోకి ప్రేరేపిస్తోంది. అందుకే మీ ఇంట్లో పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అకౌంట్‌లోని సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్‌లో ‘లెస్’ ఎంపిక చేయండి. అలాగే డైరెక్ట్ మెసేజ్‌లను నిలిపివేయండి. ‘టేక్ ఏ బ్రేక్’ ఆప్షన్‌నూ వాడుకోవచ్చు. వారికి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏజ్ వెరిఫికేషన్ చేయించండి. యాక్టివిటీని చెక్ చేస్తూ ఉండండి.
Similar News
News January 13, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News January 13, 2026
BMRCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్(<
News January 13, 2026
ఏ ముగ్గు ఏ ఫలితాన్నిస్తుంది?

నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే దుష్టశక్తులు దరిచేరవు. పద్మం ముగ్గు చెడు శక్తులను అరికడుతుంది. పూజ పీటల మీద, తులసి కోట వద్ద అష్టదళ పద్మం ముగ్గు వేసి రెండు గీతలు గీయాలి. ఇది అత్యంత శుభప్రదం. ఆలయాల్లో ముగ్గులు వేసే స్త్రీలకు సుమంగళి యోగం కలుగుతుందని నమ్మకం. అయితే స్వస్తిక్, ఓం వంటి పవిత్ర గుర్తులను నేలపై వేయరాదు. ముగ్గు లేని ఇల్లు అశుభానికి సంకేతం. అందుకే రోజూ వాకిలిని రంగవల్లికలతో అలంకరించుకోవాలి.


