News August 23, 2024

HYD: యూట్యూబర్ వంశీ కుమార్ ARREST

image

కూకట్‌పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై డబ్బులు విసిరి న్యూసెన్స్ క్రియేట్ చేసిన వంశీ కుమార్ (24) అనే యువకుడిని ఈరోజు అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు వెదజల్లే వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు కూకట్‌పల్లి సీఐ ముత్తు వెల్లడించారు. పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేస్తే సహించబోమని హెచ్చరించారు.

Similar News

News March 8, 2026

సిటీ స్కైలైన్’ పిక్నిక్: ఫ్లైఓవర్ల కింద ఫాస్ట్ ఫుడ్!

image

నగరంలోని కొత్త ఫ్లైఓవర్ల కింద ఇప్పుడు వింతైన ‘డిన్నర్’ పార్టీలు జరుగుతున్నాయి. ఖరీదైన హోటళ్లకు వెళ్లే బదులు, బయోడైవర్సిటీ, షేక్‌పేట్ ఫ్లైఓవర్ల కింద బైకులు ఆపి, రోడ్డు పక్కన దొరికే బండి మీద తిండి తింటూ గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. ట్రాఫిక్ వెలుగుల మధ్య, వాహనాల హడావుడిని చూస్తూ గడపడమే ఒక ‘అర్బన్ అడ్వెంచర్’ అని వీరు భావిస్తున్నారు. ఈ ‘స్ట్రీట్ సైడ్’ లైఫ్ స్టైల్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

News March 8, 2026

HYD: ‘కార్యేషు దాసి’.. ‘అర్ధాంగి’కి నిలువెత్తు రూపాలు..!

image

ఆ అన్నదమ్ములను విధి పక్షవాతం రూపంలో వెంటాడింది. ఘట్‌కేసర్‌ అంకుషాపూర్‌కు చెందిన బత్తుల కిష్టమ్మ కుమారులు భిక్షపతి(51), శ్రీరాములు(43) 16 ఏళ్లుగా పక్షవాతంతో పోరాడుతూ మంచానికే పరిమితయ్యారు. కాగా, వీరి భార్యలు భవానీ, సంధ్య భర్తలకు కన్నతల్లిలా సేవలు చేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ‘కార్యేషు దాసి’ అన్న ఆర్యోక్తిని వీరు నిజం చేసి చూపిస్తున్నారు. అర్ధాంగులు అన్న అర్థానికి జీవం పోస్తున్నారు.

News March 8, 2026

HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.