News August 23, 2024
ADB: బాత్రూంకు వెళ్లొచ్చేలోపే బైక్, ఫోన్ మాయం

బాత్రూంకు వెళ్లొచ్చేలోపే బైక్, ఫోన్ మాయమైన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్ఐ విష్ణు ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్వ రామ్ అనే వ్యక్తి శుక్రవారం బైక్ పై భీంసారి నుంచి గాంధీనగర్ వెళ్తుండగా మార్గ మధ్యలో బైకును పక్కన పెట్టి బాత్రూంకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ద్విచక్రవాహనం దొంగతనానికి గురైంది. వెంటనే బాధితుడు స్టేషన్ వెళ్లి వాహనంతో పాటు ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారు.
Similar News
News March 13, 2026
ADB: గ్యాస్ బుకింగ్ హెల్ప్‌లైన్ నంబర్ ఇదే

గ్యాస్ రీఫిల్లింగ్ గడువును 15 రోజుల నుంచి 20 రోజులకు పెంచామని.. దీంతో ఎలాంటి కొరత ఉండబోదని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. జిల్లాలో సిలిండర్ల స్టాక్ తగినంతగా అందుబాటులో ఉందని వివరించారు. ప్రజలు అనవసరంగా భయాందోళనతో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టవద్దని కోరారు. బుకింగ్ లేదా సరఫరలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదుకై టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939ను సంప్రదించాలని సూచించారు.
News March 13, 2026
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై వీడని ఉత్కంఠ

ADB విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. బ్లూప్రింట్ సిద్ధమైందని నేతలు చెబుతుండగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. రన్‌వే విస్తరణకు 249.81 ఎకరాలు అవసరం కానుంది. దీంతో భూములు ఎటువైపు పోతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో బాధితుల్లో భయం పెరిగింది. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
News March 13, 2026
14న ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం : ADB కలెక్టర్

జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


