News August 23, 2024
రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మె విరమణ

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఈనెల 14 నుంచి తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు విరమించారు. తమ ఆందోళనలకు ఉన్నతాధికారుల నుంచి స్పందన వచ్చిందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రేపటి నుంచి యథావిధిగా డ్యూటీల్లో పాల్గొననున్నట్లు జూడాల ప్రతినిధులు తెలిపారు.
Similar News
News March 20, 2026
NZB: ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కవిత అన్నారు. ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు మోపారని, రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని విమర్శించారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, దివ్యాంగులు అందరినీ మోసం చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేక్ తున్నారన్నారు.
News March 20, 2026
సర్‌ప్రైజ్ ఇస్తామన్నాడు.. కొన్ని గంటల్లోనే చంపేశారు

ట్రంప్, నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దాడుల్లో IRGC కీలక ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నయినీ మరణించారు. అంతకుముందు ‘మా దగ్గర క్షిపణుల నిల్వలు చాలా ఉన్నాయి. శత్రువుకు సర్‌ఫ్రైజ్‌లు ఇస్తాం’ అని నెతన్యాహును ఉద్దేశించి అలీ వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని ధ్వంసం చేశామన్న ట్రంప్ కామెంట్లపైనా స్పందిస్తూ ‘ఆయనకు ధైర్యముంటే పర్షియన్ గల్ఫ్‌లోకి నౌకలను పంపాలి’ అంటూ సవాల్ విసిరారు.
News March 20, 2026
లైంగిక వాంఛలు తీర్చకపోతే భర్త చనిపోతాడంటూ..

నాసిక్ (MH) <<19426361>>జ్యోతిషుడు<<>> అశోక్ కారత్ (67) కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ‘మంచి భర్త దొరకాలని 2022లో ఓ యువతి సంప్రదించింది. ఆమెకు ఓ తాయత్తు ఇచ్చి తీయవద్దని చెప్పాడు. పరీక్ష కోసం తీయగా వారంలో పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. దీంతో ఆమెకు నమ్మకం పెరిగింది. ఇదే అదనుగా అశోక్ మత్తుమందు ఇచ్చి రేప్ చేశాడు. లైంగిక వాంఛలు తీర్చకపోతే భర్త చనిపోతాడంటూ 2025 వరకు వేధించాడు’ అని పోలీసులు తెలిపారు.


