News August 23, 2024

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆయన రిలీజ్‌కు బ్రేక్ పడింది. కోర్టు నుంచి ఆర్డర్ కాపీలు స్టేషన్‌కు చేరడానికి ఇవాళ సమయం మించి పోవడంతో నిబంధనలు మేరకు మాజీ ఎమ్మెల్యేను జైలు అధికారులు రిలీజ్ చేయలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం లేదా మధ్యాహ్నం పిన్నెల్లి బెయిల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది.

Similar News

News March 22, 2026

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం PGRS, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్‌లో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు తమ సమస్యలను మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చన్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 22, 2026

తెనాలిలో అష్ట దిగ్గజాలకు ‘కీర్తి కిరీటం’ పురస్కారాలు

image

తెనాలిలోని రత్నా కళ్యాణ మండపంలో ఈ నెల 31న ‘మా-ఏపీ’ ఆధ్వర్యంలో ‘అష్ట దిగ్గజాలకు కీర్తి కిరీటం’ పేరిట ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలను దర్శకుడు దిలీప్ రాజ వెల్లడించారు. కలెక్టర్ అన్సారియా ముఖ్య అతిథిగా విచ్చేసి SP వకుల్ జిందాల్, కత్తెర సురేశ్ కుమార్, కుర్ర శ్రీను, డాక్టర్ శారద, వజ్రాల రామలింగాచారి సహా పలువురు ప్రముఖులకు పురస్కారాలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News March 22, 2026

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే!

image

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 320, విత్ స్కిన్ రూ. 300కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ. 430, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 230. చికెన్ ధరలు పెరగడంతో చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి..