News August 24, 2024

ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్: కలెక్టర్ ప్రశాంతి

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 24 గంటల పాటు ఫిర్యాదు నమోదుకు 1800 4252540, 0883241 7711 కు ఫోన్ చేసి తెలపాలన్నారు. జిల్లాలో పెండ్యాల, పందలపర్రు స్టాక్ యార్డ్‌ల వద్ద వినియోగదారులకు అందించేందుకు ఇసుక సిద్ధంగా ఉందన్నారు.

Similar News

News January 10, 2026

చింతా అనురాధకు కీలక పదవి

image

YCP జోన్-2 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అమలాపురం మాజీ MP చింతా అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల బాధ్యతలను ఆమె పర్యవేక్షిస్తారు. 2029 ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనురాధ కృతజ్ఞతలు తెలిపారు.

News January 10, 2026

కొవ్వూరు: గోదావరిలో దూకబోయిన వ్యక్తిని రక్షించిన పోలీసులు

image

కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వాదలకుంటకు చెందిన వినపల్లి నవీన్‌ను పట్టణ పోలీసులు రక్షించారు. 112 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ సూరిబాబు సకాలంలో చేరుకుని యువకుడు నదిలో దూకకుండా అడ్డుకున్నారు. కుటుంబ సమస్యలే దీనికి కారణమని సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ప్రాణం కాపాడిన పోలీసుల తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

News January 9, 2026

సొంతూళ్లకు వెళ్తున్నారా?.. SP కీలక సూచనలు

image

సంక్రాంతి సెలవులకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యమని, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని కోరారు. పోలీసుల ‘లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్’ (LHMS) యాప్‌ను వినియోగించుకోవడం ద్వారా దొంగతనాలకు చెక్ పెట్టవచ్చని, ప్రయాణ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.