News August 24, 2024
29 న ఏడు స్థాయి సంఘాల సమావేశం

నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 29వ తేదీ జిల్లాపరిషత్ కు సంబంధించిన ఏడు స్థాయి సంఘాల సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో కన్నమనాయుడు తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య, ఆర్ అండ్ బి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహనిర్మాణ, విద్యుత్ శాఖ, పశుసంవర్థక, మత్స్య, ఉద్యానవన, విద్య, వైద్య, ఐసీడీఎస్, గిరిజనాభివృద్ది, సాంఘిక సంక్షేమ శాఖలతో సమావేశం జరుగుతుందన్నారు.
Similar News
News March 28, 2026
నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ బస్సులపై మెరుపు దాడులు

నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై పోలీస్, రవాణా శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాలతో వాహనాల ఫిట్‌నెస్, డ్రైవర్ లైసెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, భద్రతా ప్రమాణాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రయాణికులు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
News March 28, 2026
నెల్లూరు కేబినెట్ రేసులో కొత్త పేర్లు

నెల్లూరు జిల్లాలో త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కొత్త ముఖాలకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. మంత్రులుగా ఉన్న నారాయణ లేదా ఆనం రామనారాయణ రెడ్డిలలో ఒకరిని మారుస్తారనే ప్రచారం సాగుతోంది. వారి స్థానంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మహిళా కోటా లేదా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన పనితీరు, దూకుడును బట్టి మంత్రి పదవి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
News March 28, 2026
నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు

జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సీఎం 30న నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీలో పాల్గొంటారని అన్నారు. ఒకటో తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరులో పెన్షన్ల పంపిణీకి వస్తారని వివరించారు. రెండు పర్యటనలు విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వెల్లడించారు.


