News August 24, 2024

జగన్.. ప్రజలు ఇస్తేనే హోదా వస్తుంది: చంద్రబాబు

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ప్రతిపక్ష హోదా డిమాండ్‌పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇవ్వకపోయినా జగన్ హోదా కోసం బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘జగన్.. హోదా, గౌరవం అనేవి నేరాలు, బెదిరింపులతో రావు. వాటిని ప్రజలు ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అందుకోసం కోర్టుకు వెళ్తామని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News October 26, 2025

అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులపై దుమారం

image

సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం LICతో ₹33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న Washington Post కథనం దుమారం రేపుతోంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తాము స్వతంత్రంగానే పెట్టుబడి పెట్టామని ఎల్ఐసీ స్పష్టం చేసింది. మరోవైపు 30 కోట్ల LIC వాటాదారుల కష్టార్జితాన్ని మోదీ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.

News October 26, 2025

పెట్టుబడులపై ఆరోపణలు.. కంపెనీల్లో LIC వాటాలు ఇలా!

image

₹41 లక్షల కోట్ల ఆస్తులున్న LIC దేశంలోని టాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. వీటి విలువ 2014లో ₹1.56 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు 10 రెట్లు పెరిగి ₹15.6 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుతం పలు కంపెనీల్లో వాటాలు ఇలా.. TCS-5.02%(₹5.7 లక్షల కోట్లు) *రిలయన్స్‌-6.94%(₹1.33 లక్షల కోట్లు) *ITC-15.86%(₹82వేల Cr)*SBI-9.59%(79,361 కోట్లు) *HDFC బ్యాంకు-4.89%(₹64,725 Cr ) *అదానీ గ్రూపు-4% (₹60వేల Cr).

News October 26, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

కార్తీక మాసం ప్రారంభమైనా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెద్దగా తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ కేజీ రూ.220-240, సూర్యాపేటలో రూ.220గా ఉంది. ఏపీలోని విజయవాడలో రూ.240, విశాఖలో రూ.270, చిత్తూరులో రూ.220-245, కర్నూలులో రూ.200-240 వరకు పలుకుతోంది. ఆదివారం కావడంతో రేట్లు తగ్గలేదని, రేపటి నుంచి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.