News August 24, 2024

సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు చేయనుంది. అర్హత ఉన్న వారు ఈ నెల 27లోగా దరఖాస్తులు సమర్పించాలి. 29 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేస్తారు. అభ్యంతరాలుంటే కలెక్టర్‌కు తెలియజేయవచ్చు. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారు బదిలీకి అర్హులు.

Similar News

News April 3, 2026

13న బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి?

image

TG: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైందని సమాచారం. ఈ నెల 7న కేటీఆర్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. 13వ తేదీన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు BRS సన్నాహాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

News April 3, 2026

₹10,000CRతో ‘మావిగన్’ మహానగరం: భరత్

image

AP: అమరావతికి వెచ్చించే ₹2L కోట్లలో కేవలం ₹10,000CR ‘మావిగన్’కు ఖర్చు చేస్తే మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో మహానగరం అభివృద్ధి చెందుతుందని YCP మాజీ MP భరత్ పేర్కొన్నారు. ‘మావిగన్ HYD, బెంగళూరుతో పోటీపడుతుంది. నగరాల అభివృద్ధికి వందల ఏళ్లు పడుతుంది. విశాఖ, విజయవాడ నగరాలను కాదని అమరావతిని శూన్యం నుంచి మొదలు పెడతారా? రాజధాని పేరుతో దోచుకుంటున్న CBN, ఇతర నేతలకే అమరావతి గ్రోత్ ఇంజిన్’ అని విమర్శించారు.

News April 3, 2026

యుద్ధం.. భారత్‌కు రష్యా భరోసా

image

పశ్చిమాసియాలో యుద్ధం, ఇంధన సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా ఇచ్చింది. ముడి చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సరఫరా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తమ దేశ కంపెనీల వద్ద ఆ సామర్థ్యం ఉందని, సప్లై పెంచుతామని రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మంతురోవ్ తెలిపారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల, NSA అజిత్ దోవల్‌తో భేటీ అయ్యారు.