News August 24, 2024

నల్గొండ: కార్మికులు భద్రమేనా!

image

అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో ఇటీవల పేలుడు సంభవించి 17 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆందోళన నెలకొంది. చౌటుప్పల్, బీబీనగర్, BNR, బొమ్మలరామారం, పోచంపల్లి, త్రిపురారం, MLGలో సుమారు 100 వరకు ఫార్మా పరిశ్రమలున్నాయి. ప్రమాదాలు జరగకముందే కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Similar News

News March 5, 2026

NLG: ఏప్రిల్ 1 నుంచి అంగన్‌వాడీల్లో అల్పాహారం!

image

అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు అల్పాహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని అనుముల, చింతపల్లి, దామరచర్ల, కొండమల్లేపల్లి, DVK, MNGD, MLG, NKL, NLG ప్రాజెక్టుల పరిధిలో ఈ పథకం అమలు కానుంది. జిల్లాలోని మొత్తం 2,093 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ అల్పాహార పథకం అందుబాటులోకి రానుంది.

News March 5, 2026

NLG: మూడు నెలల బియ్యం.. ఇక ఒకేసారి!

image

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్‌కు నెలకు 6 కిలోల చొప్పున, 3 నెలలకు కలిపి 18 కిలోలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 5.38 లక్షల మంది కార్డుదారులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. 1051 రేషన్ షాపులకు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించాలని ఎఫ్సీఐ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

News March 5, 2026

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

image

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7న కలెక్టరేట్‌లో ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ విన్నపాలను అందజేయవచ్చని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.