News August 24, 2024

నరసాపురం – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు

image

నరసాపురం నుంచి సికింద్రాబాద్ కు ఈ నెల 28న ప్రత్యేక రైలు నడపనున్నామని స్టేషన్ మేనేజరు గణపతి మధుబాబు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని మధుబాబు చెప్పారు. రైల్వే ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News March 28, 2026

తీర ప్రాంతాల ప్రజలకు సౌకర్యవతంగా వంతెనలు

image

10 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న <<19499031>>వంతెనల <<>>అప్రోచ్‌లకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మోక్షం కల్పించింది. తీర ప్రాంత గ్రామాలను కలుపుతూ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ వంతెనలు ఉంటాయి. అప్రోచ్‌ల నిర్మాణంలో వంతెల వద్ద ఉన్న ఆలయాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు జరిగేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వంతెనల వినియోగంలోకి వస్తే భీమవరం పట్టణంలో ట్రాఫీక్‌ సమస్య కూడా తగ్గుతుంది. పలు రకాల ఉత్పత్తుల రవాణా సులభంగా సాగుతుంది.

News March 28, 2026

ఎట్టకేలకు భీమవరం వంతెనలకు మోక్షం

image

భీమవరం, యనమదుర్రు డ్రైన్ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చేపల మార్కెట్, గొల్లవానితిప్ప, తోకతిప్ప బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నాయి. వైసీపీ హయాంలో వంతెనలు కట్టినా రోడ్లు వేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పనులు పట్టాలెక్కడంతో పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

News March 28, 2026

ఆకివీడు ఆలయం వద్ద కంచె.. మోహరించిన బలగాలు

image

ఆకివీడు పెదపేటలోని శిథిలావస్థకు చేరిన ఆలయం వద్ద శ్రీరామనవమి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా, భక్తులు లేదా ఇతర వ్యక్తులు ఎవరూ ఆలయం లోపలికి వెళ్లకుండా అధికారులు ఆలయం చుట్టూ ఇనుప కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఈ ప్రాంతంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. భారీగా పోలీసు బలగాలు మోహరించి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.