News August 24, 2024
విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్

AP:చేనేత, హస్తకళలను ప్రోత్సహించేలా కేంద్రం మంజూరు చేసిన యూనిటీ మాల్ విశాఖ మధురవాడలో అందుబాటులోకి రానుంది. రుషికొండ బీచ్‌కు 5K.Mల దూరంలో సముద్రపు ఒడ్డున 5 ఎకరాల్లో G+4 తరహాలో రూ.172 కోట్లతో నిర్మిస్తారు. 2 అంతస్తుల్లో 62 షాపుల్లో వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్, GI గుర్తించిన ఉత్పత్తులు ఉంటాయి. 3వ ఫ్లోర్‌లో సముద్రం వీక్షించేలా సీ వ్యూ, 4వ ఫ్లోర్‌లో కన్వెన్షన్ హాలు, 2 థియేటర్లు, ఇతర స్టోర్లు ఉంటాయి.
Similar News
News March 15, 2026
నెతన్యాహును వేటాడి మరీ చంపేస్తాం: IRGC

నెతన్యాహు మరణించలేదంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ఒకవేళ ఆయన బతికే ఉంటే వేటాడి మరీ చంపేస్తామని IRGC హెచ్చరించింది. మరోవైపు నెతన్యాహు చేతికి ఆరువేళ్లు ఉన్నాయని.. అది <<19382555>>AI వీడియో<<>> అని ఇరాన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది AI వీడియో కాదని, లైటింగ్ వల్ల ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడి అలా ఒక వేలు ఎక్స్‌ట్రా ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.
News March 15, 2026
బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్ (లేదా) 2mlహెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.
News March 15, 2026
చిన్నచిన్న ధర్మాలతో పాపాలెలా పోతాయి?

జనకుడితో వశిష్ఠ మహర్షి ఇలా వివరించారు.. ‘అడవిలో ఎండుగడ్డి వాము ఎంత పెద్దదైనా చిన్న నిప్పు రవ్వ దాన్ని క్షణంలో బూడిద చేస్తుంది. అలాగే యుగయుగాల పాపలు ధర్మాలనే చిన్న పుణ్య కార్యాల ముందు నిలవలేదు. భక్తితో చేసే నదీ స్నానం, దీపారాధన పాపాలను దహించివేస్తాయి. ‘నారాయణ’ అనే నామానికి ఉన్న శక్తి అపారమైనది. ఆ నామ ఉచ్ఛారణతో యమభటులే వణికిపోతారు. భగవంతుని కృపకు ఆడంబరమైన యజ్ఞాల కంటే ధర్మం మిన్న అని గ్రహించు’.


