News August 24, 2024
కడప జైలు వార్డెన్‌పై హత్యాయత్నం కేసు నమోదు

కాకినాడ జిల్లాకు చెందిన భువనేశ్వరి ఫిర్యాదుతో కడప జిల్లా జైలు వార్డెన్‌గా పనిచేస్తున్న మహేశ్‌పై తుళ్లూరు పోలీసులు శుక్రవారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మహేశ్‌తో భువనేశ్వరికి నాలుగు నెలల క్రితం వివాహం అయిందని సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. రాయపూడిలో అద్దెకు ఉంటున్న వీరి మధ్య గురువారం గొడవ జరిగిందని, వంట గ్యాస్ వదిలి ఆమె గాయపడేలా చేసి అతను కూడా విషం తాగాడన్నారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News March 18, 2026
కడప జిల్లాలో రైతుల నుంచి వసూళ్లు ఎంత..?

కడప జిల్లాలో రైతుల నుంచి MSPతో పంటల కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5,732 మంది శనగ రైతులు వీటిలో రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 3,143 మంది రైతుల నుంచి 13,078.5 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశారు. బస్తాకు రూ.150 – రూ.200లు మామూళ్లు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన రూ.3, 4 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News March 18, 2026
కడపలో నేడు మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కడపలోని నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు జరగనుంది. కాగా ముస్లిం సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం గురువులు పాల్గొంటారన్నారు.
News March 18, 2026
కడప జిల్లాలో భారీగా ఆగిన నగదు చెల్లింపు

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.


