News August 24, 2024
పిఠాపురం MLAపై అభ్యంతరకర పోస్టులు.. ఉద్యోగి సస్పెండ్

సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టి ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘించిన సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సహకార శాఖ రిజిస్ట్రార్, కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరుకు చెందిన చౌదరి ఇతనిపై కమిషనర్‌కు, మంత్రికి ఈ నెల 21న ఫిర్యాదు చేయగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొవ్వూరు నుంచి బదిలీపై విజయవాడకు వెళ్లారు.
Similar News
News March 22, 2026
రాజమండ్రి: వేసవి కార్యాచరణ సిద్ధం

వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి నుంచే ఎండల తీవ్రత పెరుగుతున్నందున తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
News March 22, 2026
ప్రజా సమస్యలకు చెక్.. సోమవారం మిస్ కావద్దు!

జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు హాజరై ప్రజల నుంచి PGRS అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.